తీవ్ర చలిగాలుల ప్రభావం: జమ్మూకశ్మీర్లో పాఠశాలల వేళలు మార్పు
రిపోర్టర్: గోపి
స్థలం: Srinagar
జమ్మూకశ్మీర్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు తీవ్ర చలిగాలుల ప్రభావం పెరగడంతో పాఠశాలల వేళలను మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశలు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పనిచేస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం పదిన్నర నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు.