జగిత్యాలలో సీఎంఆర్ బకాయిల కలకలం: ఎనభై కోట్ల దందా గుట్టురట్టు
రిపోర్టర్: సురేష్
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన కస్టమ్ మిల్డ్ రైస్ బకాయిల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. హమాలీగా పనిచేసిన ఒక వ్యక్తి మూడు రైస్ మిల్లులకు అధినేతగా ఎదిగి, సుమారు ఎనభై కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యం లెక్కలు ఎగవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిధులను సినీ నిర్మాణ రంగానికి మళ్లించారనే విమర్శలు వ్యక్తమవుతుండగా, ఈ అంశంపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.