గాయం నుంచి కోలుకుంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

పెద్ది సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మణికట్టు నయం కావడంతో క్రమంగా కోలుకుంటున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. గతంలో చేతికి ఉన్న పెద్ద కట్టు తొలగించి కేవలం సపోర్టింగ్ బెల్ట్ ధరించిన ఆయన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యులతో కలిసి దిగిన ఈ ఫోటోలు చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.