మహిళల ఆంధ్రా ప్రిమియర్ లీగ్ ఫైనల్కు రాయలసీమ జెన్ స్టార్స్

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

మహిళల ఆంధ్రా ప్రిమియర్ లీగ్లో రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. అమరావతి ఈ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయలసీమ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అమరావతి 140 పరుగులకే ఆలౌటైంది. ఆదివారం జరిగే తుది పోరులో గోదావరి గోల్డెన్ ఈగల్స్తో రాయలసీమ తలపడనుంది.