పెద్ద వాల్గోట్లో భూభారతి రీ సర్వే: రైతులకు అధికారుల అవగాహన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పెద్ద వాల్గోట్

నిజామాబాద్ రూరల్ మండలంలోని పెద్ద వాల్గోట్ గ్రామంలో భూభారతి భూముల రీ సర్వే కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సర్పంచ్ వనిత అధ్యక్షతన జరిగిన ఈ సభలో సర్వే శాఖ ఏడి శ్రీనివాస్ ప్రక్రియను వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి భూ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీవో రఫీ అహ్మద్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.