జగన్ అక్రమాస్తుల కేసు: రోజువారీ విచారణ జరపాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. తొమ్మిది ఛార్జిషీట్లపై పదేళ్లుగా విచారణ కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదని ఈడీ ఆవేదన వ్యక్తం చేసింది. డిశ్చార్జి పిటిషన్లతో పాటు అన్ని అభియోగపత్రాలపై రోజువారీ విచారణ జరిపేలా సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించాలని ఉన్నత కోర్టును అభ్యర్థించినట్లు సమాచారం.