మేక్ ఇన్ ఇండియా విజయవంతంగా పన్నండేళ్లు పూర్తి చేసుకుందన్న పురందేశ్వరి

రిపోర్టర్: హరి స్థలం: తూర్పు గోదావరి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా ఉద్యమం భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయడంతో పాటు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని ఆమె తెలిపారు.