వర్షపునీటితో అతలాకుతలం: విజయనగరంలో పది కాలనీలకు తీవ్ర ముంపు బెడద

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం నగరంలో వర్షం కురిస్తే చాలు పది కాలనీలు జలమయమవుతున్నాయని కమిషనర్ బాలస్వామి తెలిపారు. పెద్దచెరువు ఉప్పొంగడం వల్ల వినాయకనగర్ తో పాటు పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పూడికతో నిండిపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని వారు వాపోతున్నారు. ముంపు నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.