ఓటీటీలో అలరిస్తున్న నా వైఫ్ మిస్సింగ్: హైదరాబాద్‌లో వేడుక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
వరుణ్ సందేశ్ మరియు శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన నా వైఫ్ మిస్సింగ్ సినిమా ఆహా ఓటీటీ వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీమియర్ మరియు ప్రెస్ మీట్ కార్యక్రమంలో నటుడు మురళీమోహన్, దర్శకుడు హరీశ్‌శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నమ్మకమే బంధాన్ని నిలబెడుతుందనే ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని నటీనటులు కోరారు.