అక్రమాస్తుల ఆరోపణలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ రగడ
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫామ్‌హౌస్‌లు మరియు అక్రమాస్తుల రగడ తీవ్ర స్థాయికి చేరింది. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల అధికారంలో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్ ఫైల్స్ పేరిట క్షేత్రస్థాయి యాత్రలు చేపట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు తమ ఆస్తులన్నీ పారదర్శకంగానే ఉన్నాయని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ తిప్పికొడుతున్నారు.