వర్షాకాలంలో బాత్రూమ్ డ్రైనేజీ పైపుల ద్వారా ఇళ్లలోకి పాముల ప్రవేశం

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

వర్షాకాలంలో ఇళ్లలోని టాయిలెట్లు మరియు బాత్రూమ్ డ్రైనేజీ పైపుల ద్వారా పాములు ప్రవేశించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేమ, చల్లదనం కోసం అలాగే ఆహారాన్ని వెతుకుంటూ ఇవి లోపలికి వస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రైన్ రంధ్రాలకు జాలీలు అమర్చడం, నాన్-రిటర్న్ వాల్వ్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వీటిని సమర్థవంతంగా అరికడవచ్చని తెలిపారు. బాత్రూమ్లో పాము కనిపిస్తే అస్సలు కంగారుపడకుండా తక్షణమే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.