వేసవి నీటి ఎద్దడి నివారణకు మోత్కూరులో కౌన్సిల్ యుద్ధప్రాతిపదికన చర్యలు
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
రానున్న వేసవిలో ఎల్నీనో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మోత్కూర్ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్న అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో తాగునీటి సరఫరా, బోర్లు, వీధి దీపాల కొనుగోలుకు సంబంధించి పదహారు అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్యతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.