ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంపై ఆలోచనలు పంచుకోవాలని కిషన్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఈ నెల 25వ తేదీన జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, అనుభవాలు, స్ఫూర్తిదాయక కథలను పంచుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కోరారు. మైగవ్, నమో యాప్ వేదికల ద్వారా లేదా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తమ సందేశాలను రికార్డ్ చేసి అభిప్రాయాలు తెలియజేయాలని ఆయన ప్రజలను తాజాగా కోరారు.