సర్ అంశాన్ని వ్యతిరేకిస్తే వీపు సాఫ్ చేస్తాం: బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: రమేష్ స్థలం: నిర్మల్

నిర్మల్ లో నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్ అంశాన్ని వ్యతిరేకిస్తే అటువంటి వారి వీపు సాఫ్ చేయాలని ఘాటుగా హెచ్చరించారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో త్వరలోనే కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.