దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు
రిపోర్టర్: సునీల్
స్థలం: Vijayawada
రాష్ట్ర ప్రజల సుభిక్షం మరియు సమృద్ధి కోసం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు I&PR AP వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అంతరాయం కలగకుండా భక్తులకు నిరంతరంగా దర్శన క్యూ కొనసాగడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.