పాడేరు జడ్పీటీసీ స్థానానికి బీసీవై అభ్యర్థిగా పాంగి నవీన్ నామినేషన్
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పాడేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి భారత చైతన్య యువజన పార్టీ తరఫున పాంగి నవీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్‌తో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. టార్చ్‌లైట్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండల ఓటర్లను ఈ సందర్భంగా పాంగి నవీన్ ప్రత్యేకంగా కోరారు.