స్థానిక సంస్థల నామినేషన్లపై అవాస్తవ ప్రచారం అంటూ వైఎస్సార్సీపీపై కూటమి మండిపాటు

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కేవలం ఫేక్ ప్రచారమేనని రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. క్షేత్రస్థాయిలో నామినేషన్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, ప్రతిపక్షం ఓటమి భయంతోనే అసత్యాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.