జన్నారంలో యమపాశాలుగా మారిన మలుపులతో వణుకుతున్న వాహనదారులు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్ల మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాదంపల్లి మరియు ధర్మారం గ్రామాలకు వెళ్లే రోడ్లపై ఉన్న ప్రమాదకర మలుపుల వద్ద బోర్డులు కొరవడ్డాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.