దేశంలో అత్యంత సంపన్న కుటుంబంగా దూసుకెళ్లిన గౌతమ్ అదానీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
భారత దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎమ్3ఎమ్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అదానీ సంపద 13 శాతం మేర వృద్ధి చెంది రూ.9.23 లక్షల కోట్లకు చేరుకోగా, అంబానీ సంపద 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లకు పరిమితమైంది.