బ్రిడ్జి కూల్చివేత హామీపై గడ్డపారలతో కదంతొక్కిన బీజేపీ శ్రేణులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్టలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బ్రిడ్జిని తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్కుమార్ ఆరోపించారు. సింహద్వారం వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ నెల రోజులు గడిచినా ఎలాంటి పనులు జరగలేదన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి పర్యటనలు చేయడం తగదని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.