'బాధితుల సమస్యలకు సత్వర న్యాయమే మా ప్రాధాన్యత': కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా

రిపోర్టర్: రాము స్థలం: Amalapuram

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుల సమస్యలపై ఎస్పీ రాహుల్ మీనా స్పందించారు. బాధితుల సమస్యలకు సత్వర న్యాయం అందించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పారదర్శకంగా విచారణ జరిపి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.