ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్లో దంపతుల అతిదారుణ హత్య
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Sultanpur
సుల్తాన్పూర్ జిల్లాలోని కుంభీ దడియా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముఖేష్ సింగ్, ఆయన భార్య వినితలను దుండగులు గొడ్డలి, పారతో నరికి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ వినీత్ జైస్వాల్ వెల్లడించారు. తాము నడుపుతున్న ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలోనే ఈ దంపతుల మృతదేహాలు రక్తపు మడుగులో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు వేగవంతం చేశారు.