భద్రకాళి ఆలయ శరన్నవరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్

రిపోర్టర్: నరేష్ స్థలం: వరంగల్

వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ నెల పదకొండో తేదీ నుంచి ప్రారంభం కానున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముందస్తు భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, భద్రతా విభాగాలను సీపీ స్వయంగా తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలు అందజేశారు.