మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం తెలిపిన ఎమ్మెల్యే గౌతు శిరీష
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. ఆదివారం ఆయా కుటుంబాలను స్వయంగా కలిసిన ఆమె, మృతుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ దుఃఖ సమయంలో అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.