'ఆయిల్ ఫాం సాగుకు ఎకరానికి ₹46,252': మంత్రి తుమ్మల కీలక ప్రకటన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Telangana

వ్యవసాయ, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల కోసం ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ పథకం కింద, ఆయిల్ ఫాం సాగు చేసే ప్రతి రైతుకు ఎకరానికి ₹46,252 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి ప్రకటించారు. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, మొదటి నాలుగు సంవత్సరాల పాటు ఎరువులు, అంతర పంటల సాగు వంటి వాటికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన వివరించారు.