జాపనీస్ రెస్టారెంట్లో అమెరికన్ స్ట్రీమర్ లీసీకి చేదు అనుభవం: భారీ బిల్లు కలకలం

రిపోర్టర్: హరి స్థలం: Tokyo

జపాన్ దేశంలోని టోక్యో నగరంలో ఓ రెస్టారెంట్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో అమెరికన్ ట్విచ్ స్ట్రీమర్ లీసీ క్యూఆర్ కోడ్ ద్వారా భారీ ఆర్డర్లు రావడంతో తొలుత రూ.11.38 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భాషా సమస్య కారణంగా తాను అపార్థం చేసుకున్నానని, కేవలం అదనంగా తయారైన ఆహారానికి మాత్రమే డబ్బులు చెల్లించానని ఆ తర్వాత లీసీ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.