'అపరిశుభ్రత, పాడైన మాంసం': మంగళగిరి రెస్టారెంట్‌పై అధికారుల సీరియస్

రిపోర్టర్: అశోక్ స్థలం: గుంటూరు

మంగళగిరి కాజా టోల్‌ప్లాజా సమీపంలోని కుంభకర్ణ మల్టీ క్యూజీన్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐపీఎం డైరెక్టర్ అరుణ్‌బాబు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ఫ్రీజర్‌లో పాడైన మాంసం, చికెన్, గడువు ముగిసిన పదార్థాలను గుర్తించి ధ్వంసం చేశారు. వంటగది అపరిశుభ్రంగా ఉండటం, రక్తపు మరకలు తేలడంతో నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, రెస్టారెంట్ వంటగది కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.