గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా జనసేన పార్టీలోకి ముప్పై కుటుంబాల చేరిక
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జీ.మాడుగుల
జీమాడుగుల మండలంలోని లువ్వసింగి పంచాయతీ బూసిపల్లి గ్రామంలో జనసేన పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. అడవి తల్లి బాట కార్యక్రమానికి ఆకర్షితులై ముప్పై కుటుంబాలు పార్టీలోకి వచ్చాయి. చింతపల్లి మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు, నాయకుడు వంతల సుబ్బారావు నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని వారు తెలిపారు.