దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
భారతీయ బులియన్ మార్కెట్లో మంగళవారం ఉదయం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడటం వల్ల పసిడి రేట్లు దిగివచ్చాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,140గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,41,290 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ. 2,54,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.