పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టు అరెస్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: పంజాబ్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ కాన్వాయ్‌పై గుడ్లు, టమాటాలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టును లుధియానా పోలీసులు అరెస్టు చేశారు. బటాలా సమీపంలో తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అందించేందుకే వెళ్లామని బిట్టు కార్యాలయం పేర్కొంది. ఈ ఘటనతో పంజాబ్‌లో బీజేపీ, ఆప్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.