2027 ప్రపంచకప్ కోసం ఆటగాళ్లకు తగిన అవకాశాలివ్వాలి: యువరాజ్ సింగ్

రిపోర్టర్: గోపి స్థలం: India

2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత్ ఇప్పటి నుంచే 16 నుంచి 20 మందితో కోర్ గ్రూప్‌ను సిద్ధం చేసుకోవాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సూచించారు. చివరి నిమిషంలో భారీ మార్పులు చేయడం వల్ల టోర్నీల్లో వైఫల్యాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఆటగాళ్ల సామర్థ్యంపై నమ్మకంతో వారికి తగినన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.