ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి.. ఏఐటీయూసీ డిమాండ్

రిపోర్టర్: katikapalli perumal స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలో ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నిండ్ర పీహెచ్సీలో వైద్య అధికారికి వినతి పత్రం సమర్పించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందమారై అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.