నెల్లూరులో కూటమి ప్రభుత్వం అరాచకాలను ప్రజలు గమనించాలన్న కాకాణి
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను అన్యాయంగా తిరస్కరింపజేస్తోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. చింతా రెడ్డిపాలెంలో మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టి బెదిరింపులకు పాల్పడితే వైయస్సార్సీపీ శ్రేణులు భయపడవని, చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.