మహబూబ్నగర్ ముడా చైర్మన్ పదవి రేసులో తీవ్ర పోటీ

రిపోర్టర్: గోపి స్థలం: Mahabubnagar

మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి అక్టోబర్ నెలలో ఖాళీ కానుండటంతో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమైనట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నేతలు ఈ నామినేటెడ్ పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రస్తుత చైర్మన్ లక్ష్మణ యాదవ్ పదవీకాలం ముగియనుండటంతో స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై జిల్లాలో ఆసక్తి నెలకొంది.