గిరిజన గ్రామాల రహదారి సమస్యపై అధికారుల ప్రత్యేక దృష్టి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి జిల్లా జి.కె.వీధి మండలంలో ఉన్న అద్దరవీధి నుంచి మండపల్లి వరకు రహదారి లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలోని పలు గ్రామాలకు రవాణా సదుపాయం కరవైంది. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌లు రాకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.