జామ్నగర్ రిఫైనరీలో అమెరికా విదేశాంగమంత్రి మార్కోరూబియో పర్యటన: చమురు దిగుమతులపై కీలక చర్చలు

రిపోర్టర్: నరేష్ స్థలం: జామ్‌నగర్

భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగమంత్రి మార్కోరూబియో గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీని సందర్శించి ప్రతినిధులతో సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. వెనెజువెలా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లను మరింత పెంచడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ రిఫైనరీ చమురు మార్కెట్లను స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని, ముడి చమురు దిగుమతులు మరియు ఎగుమతులపై ఇరువర్గాలు చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.