విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన కృష్ణమ్మ వరద ఉధృతి
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బ్యారేజ్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో గురువారం రాత్రి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో కూడా రోడ్లు జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.