మసాలా దోశతో ఓట్ల వేట: టెక్సాస్‌లో అమెరికన్ నేత ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: వెంకట్
స్థలం: టెక్సాస్
అమెరికాలో ఎన్నికల ప్రచారం అంటే హోరాహోరీ విమర్శలు గుర్తుకు వస్తాయి. కానీ టెక్సాస్ సెనేట్ బరిలో ఉన్న జేమ్స్ తలారికో పూర్తి భిన్నంగా ఆలోచించారు. భారతీయ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఏకంగా మసాలా దోశ వేయడానికి సిద్ధమయ్యారు. డల్లాస్ సమీపంలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన, చెఫ్ సాయంతో స్వయంగా దోశ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రత్యేక ప్రచార శైలిపై డెమొక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో తెలిపారు.