ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా

రిపోర్టర్: రమేష్ స్థలం: కర్ణాటక

కర్ణాటకలోని జిల్లా వినియోగదారుల కమిషన్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ప్రత్యేక సైకిల్ హ్యాండ్లింగ్ కోసం అదనంగా రెండు వేల రూపాయలు వసూలు చేసి, దానిని సాధారణ లగేజ్ బెల్ట్‌పై ఉంచడాన్ని సేవాలోపంగా పరిగణించింది. చెన్నై నుంచి మంగళూరు వెళ్తున్న ప్రయాణికుడు సుశాంత్ ఎన్.జి. ఫిర్యాదు మేరకు స్పందించిన కమిషన్ ప్రెసిడెంట్ సోమశేఖరప్ప కె. హండిగోళ్, మెంబర్ శారదమ్మ హెచ్.జి. నేతృత్వంలోని బెంచ్, ఎయిర్ లైన్స్ సంస్థ ప్రయాణికుడికి రెండు వేల రూపాయల ఫీజు రీఫండ్‌తో పాటు పరిహారం, కోర్టు ఖర్చుల కింద అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని ఆగస్టు 31, 2026 న తీర్పు వెలువరించింది.