బెల్లంపల్లిలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
శాసనసభ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి బీజేపీ పిలుపునివ్వడంతో బెల్లంపల్లి పట్టణంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వన్ టౌన్ పోలీసులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్, సీనియర్ నాయకులు గోవర్ధన్, యుగంధర్, అరవింద్, నరసింగరావులను సోమవారం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అక్రమ అరెస్టులతో గొంతునొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు.