కావలిలో అక్రమ మట్టి తరలింపుపై హెచ్చరిక: నిబంధనల ప్రకారం విక్రయాలకు చర్యలు

రిపోర్టర్: రమేష్ స్థలం: నెల్లూరు

కావలి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ సహాయ ఇంజనీర్ జంపాని కిరణ్కుమార్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముసునూరు మందాడి చెరువులో ఉన్న లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని నిబంధనల ప్రకారం విక్రయించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. చెరువుల నుంచి మట్టి తొలగింపు వల్ల భూగర్భ జలమట్టం మెరుగవుతుందని పేర్కొంటూ, ఆసక్తి గలవారు కార్యనిర్వాహక ఇంజనీరును సంప్రదించి అనుమతులు పొందాలని ఆయన స్పష్టం చేశారు.