ఓట్ల గల్లంతుపై రేవంత్ రెడ్డి నిప్పులు: మోదీ సర్కార్పై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: రమేష్ స్థలం: ఢిల్లీ

ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఓటు బచావో దేశ్ బచావో ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. దేశ జనాభా పెరుగుతున్నప్పటికీ పదమూడు కోట్ల ఓట్లు ఎలా గల్లంతయ్యాయని ఆయన నిలదీశారు. దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని సీఎం ఆరోపించారు.