లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లబ్ధిదారులకు సకాలంలో సహాయం అందేలా అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలనేదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.