హౌసింగ్ పథకాలపై అధికారులతో ఎమ్మెల్యే కసిరెడ్డి సమీక్ష సమావేశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి నియోజకవర్గంలో హౌసింగ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల పురోగతి, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, నిర్మాణ దశల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయడంలో జాప్యం లేకుండా చూడాలని, క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు ఎంపీడీవోలు, ఏఈలు పాల్గొన్నారు.