రామ్ లీలా మార్చ్పై రాహుల్ గాంధీ నిప్పులు: ప్రజాస్వామ్య పరిరక్షణకు కదలాలని పిలుపు

రిపోర్టర్: రమేష్ స్థలం: ఢిల్లీ

ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలను వ్యతిరేకిస్తూ నవంబర్ ఒకటో తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ రామ్ లీలా మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపడుతున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పోలీసుల లాఠీలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, దేశ ఆత్మను కాపాడుకునేందుకు అందరూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మార్చ్ ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదని, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.