అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తామన్న తెలుగు దేశం పార్టీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Amaravati
అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తామని Telugu Desam Party (TDP) వెల్లడించింది. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ కార్యకలాపాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. రాబోయే రెండేళ్లలో అమరావతిలోనే క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఈ సరికొత్త సాంకేతికతతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ పార్టీ నేతలు తెలిపారు.