'బాలన్ డిఆర్ కోసం మాస్టర్ ప్లాన్': కైలియన్ ఎంబాపె కోసం రియల్ మాడ్రిడ్ వ్యూహం

రిపోర్టర్: రమేష్ స్థలం: World

ప్రతిష్టాత్మక బాలన్ డిఆర్ అవార్డును కైలియన్ ఎంబాపె సొంతం చేసుకునేలా రియల్ మాడ్రిడ్ క్లబ్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. గతంలో క్రిస్టియానో రొనాల్డోకు మద్దతుగా అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు ఎంబాపె కోసం పునరావృతం చేయాలని మాడ్రిడ్ భావిస్తోంది. క్లబ్ దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లను రంగంలోకి దింపి ఎంబాపె వ్యక్తిగత ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని చూస్తున్నారు. హ్యారీ కేన్, లామిన్ యామాల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో, రియల్ మాడ్రిడ్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఫుట్‌బాల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.