గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

రిపోర్టర్: విజయ్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద పిలుపునిచ్చారు. తాను స్వయంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో యువత, పట్టభద్రులు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని కె.పి. వివేకానంద విజ్ఞప్తి చేశారు.