తెలంగాణలో భారీ పెట్టుబడులతో హుందాయ్ మోటార్స్: యువతకు వేల ఉద్యోగాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హుందాయ్ మోటార్స్ ముందుకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ పరిధిలో రూ. 8,528 కోట్ల భారీ పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని యువతకు సుమారు 4,276 కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ యాజమాన్యం అధికారికంగా పేర్కొంది.