భారీ ఊరట: నగరంలో తాగునీటి కొరత నివారణకు గోదావరి జలాల మళ్లింపు

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

రానున్న కాలంలో ఎల్నినో పరిస్థితుల వల్ల ఎదురయ్యే తీవ్ర తాగునీటి కొరతను సమర్థంగా అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి ఆధ్వర్యంలో వెలిమెల వద్ద గోదావరి రింగ్ మెయిన్ను మంజీరా పైప్లైన్లతో అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా భాగ్యనగర ప్రజలకు వేసవిలోనూ నిరంతరంగా తాగునీటిని అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.